యూపీలో పైశాచికం : వృద్ధురాలిపై లైంగిక దాడి
లక్నో : వయోభేదం లేకుండా మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యూపీలోని సోన్‌భద్ర జిల్లా అన్పారా పోలీస్ స్టేషన్ పరిధిలో 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 1న ఈ దారుణం చోటుచేసుకోగా నిందితుడు రామ్ కిషన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వృద్దురాలిపై లైంగిక దాడికి సంబంధించిన సమాచారం అందగానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, బాధితురాలికి వైద్య చికిత్స అందిస్తున్నారని పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో మహిళలపై నేరాలు పెచ్చుమీరుతున్నాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.