మున్సిపాలిటీలు అంటే మురికికూపాలు, అవినీతి నిలయాలు అన్న పేరుపొందాయని ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో ఈ పేరు మారి పట్టణాలు అంటే ప్రగతి నిలయాలుగా మార్పు చెందాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మ్ంరత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. పట్టణాల్లో ఉన్న అవసరాలను తీర్చే విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా పట్టణ ప్రగతి నిర్వహించుకోవాలన్నారు. పల్లెల నుంచి పట్టణాలకు వివిధ కారణాలతో వచ్చే వారి మౌలిక అవసరాలు తీర్చే విధంగా మన పట్ట ప్రణాళిక ఉండాలనేది సీఎం ఆలోచన అన్నారు. ప్రభుత్వ స్థలాలు గుర్తించి స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు నిర్మించాలన్నారు. మురికి కాలువలు ఏరోజుకారోజు శుభ్రం చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రగతి నిలయాలుగా పట్టణాలు : మంత్రి సత్యవతి రాథోడ్