బస్సులో తరలిస్తున్న బంగారం స్వాధీనం..


హైదరాబాద్‌: నగర శివారులో డీఆర్‌ఐ అధికారులు ఓ ప్రైవేట్‌ బస్సులో తరలిస్తున్న అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు చూసినైట్లెతే.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సులో అక్రమ బంగారం తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు.. డీఆర్‌ఐ(డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిజెన్స్‌) అధికారులు బస్సును హైదరాబాద్‌ నగర శివారులో అడ్డగించి, సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు వ్యక్తుల వద్ద 3.09 కిలోల బంగారం లభించింది. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ బంగారం విలువ రూ. కోటి 38 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.